‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్.. ఆ సాంగ్ నెక్స్ట్ లెవల్ అంతే: గణేశ్ మాస్టర్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు కొరియోగ్రఫీ చేసే డ్యాన్స్ మాస్టర్ గణేశ్..గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులందరికీ తెలుసు. జనసేనానికి నచ్చిన కొరియోగ్రాఫర్ గా ఉన్న గణేశ్ మాస్టర్ ..పవన్ చూపిన బాటలోనే తన శక్తి మేరకు నడుస్తున్నారని చెప్పొచ్చు. కష్టాల్లో ఉన్న వారకి తన వంతు సాయంగా గణేశ్ మాస్టర్ కొంత సాయం అయితే చేస్తు్న్నారు.

‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ తో పాటు పలు పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేశ్ మాస్టర్ ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి పలు విషయాలు చెప్తూనే ‘హరిహర వీరమల్లు ’ఫిల్మ్ అప్ డేట్ ఇచ్చేశారు. పవన్ కల్యాణ్ కు జెన్యూన్ గా ఉన్న వ్యక్తులంటే చాలా ఇష్టమని చెప్పాడు. తాను తమ్ముడు, బద్రి సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ గా పని చేశానని గుర్తు చేసుకున్నాడు గణేశ్.

ఇక తనకు ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అవకాశం ఇచ్చాడని, ఇక అప్పటి నుంచి ‘భీమ్లా నాయక్’ మూవీ వరకు తన జర్నీ కొనసాగిందని, కొనసా..గుతున్నదని చెప్పుకొచ్చారు గణేశ్ మాస్టర్. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ ఫిల్మ్‌లో ఓ పాటను కొరియోగ్రఫీ చేసినట్లు వివరించారు. 400 మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ పూర్తి చేసినట్లు వివరించారు. హరీశ్ శంకర్ తో చేయబోయే ‘భవదీయుడు భగత్ సింగ్ ’పిక్చర్ లో కూడా తను సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తానని, అభిమానుల అంచనాలను మించి సాంగ్స్ ఉంటాయని వివరించారు గణేశ్ మాస్టర్.

Read more RELATED
Recommended to you

Latest news