ఏపీలో టీడీపీ నేతలకు, వైసీపీ నేతలకు మధ్య పచ్చగడ్డ వేసినా భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరి విమర్శలకు ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే కొన్ని రోజులుగా మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ.. టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు మంత్రి రాంబాబు రాసలీలలు అంటూ కొన్ని ఆడియోలను ట్విట్టర్ వేదికగా బయట పెట్టారు. అయితే అది విపక్షాల కుట్ర అంటూ వ్యాఖ్యానించా మంత్రి అంబటి.
ఈ క్రమంలోనే పొలవరం ప్రాజెక్టుపై దేవినేని ఉమా ఉమహేశ్వర రావుకు అంబటికి మధ్య ట్విట్ల వార్ జరుగుతోంది. అయితే తాజాగా దేవినేని ఉమకు సంబంధించి ఓ ట్వీట్ ను మంత్రి అంబటి రాంబాబు పంచుకోవడం తెలిసిందే. అది ఫేక్ ట్వీట్ అంటూ టీడీపీ నేతలు ముక్తకంఠంతో అంబటి రాంబాబు విమర్శలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఇందుకు కదూ నిన్ను చిల్లర రాంబాబు అనేది అంటూ నిప్పులు చెరిగారు అయ్యన్న. “పేటీఎం చిల్లర వెధవలు తయారుచేసిన ఫేక్ పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలనుకునే నీలాంటి గొట్టంగాడికి మంత్రి పదవిని ఇచ్చిన వాడిని అనాలి” అంటూ మండిపడ్డారు అయ్యన్న.