హాలీవుడ్ సినిమాలతో మ్యాచ్ అవుతున్న బాహుబలి.. మొత్తం కాపీ నేనా..వీడియో వైరల్..!!

-

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఏ రేంజ్ లో విజయవంతం అయ్యిందో అంతే రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి ఖ్యాతి ని పెంపొందించింది అని చెప్పవచ్చు. ఈ సినిమా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కినప్పటి నుంచి ప్రస్తుతం వరుస మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయని చెప్పవచ్చు . అంతేకాదు ఈ సినిమాతోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రాజమౌళి ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్, రానా నటించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు కట్టప్పగా సత్యరాజ్, అనుష్క, తమన్నా అందరూ కూడా ఈ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక శివగామిగా రమ్యకృష్ణ క్రేజ్ సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఈ సినిమా తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా బాహుబలి 2 సినిమాను కూడా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలోనే అరుదైన రికార్డులను కొల్లగొట్టి తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ విజయకేతనం ఎగరవేసింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల్లోని సన్నివేశాలతో మ్యాచ్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే వీడియోలోని కొన్ని హాలీవుడ్ సినిమాల క్లిప్స్ తో బాహుబలి సినిమాను పోల్చారు . అన్ని కరెక్ట్ గా సింక్ అయ్యాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరికొంతమంది కొంపదీసి రాజమౌళి కూడా కాపీ కొట్టాడా ఏంటి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.Bahubali facts: Top 8 things about the record breaking film you should know | India.com

ఇక బాహుబలి సినిమా ఊహాగానం మాత్రమే అని అప్పుడే రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మనం చూసే ఉన్నాం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పుపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news