ఉదయం నుంచి గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం ముగిసింది. గుంటూరు ప్రజలకు రాజధాని కావాలి కానీ.. రాజధాని నిలుపుకునేందుకు ఏమీ చేయరని అన్నారు. 460 రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే మీరేం చేశారు ? అని ఆయన ప్రశ్నించారు. గుంటూరు వాసులకు స్వార్దం , పిరికితనం ఎక్కువ, రోషం లేదన్న ఆయన ఒక ఉన్మాది చేతుల్లో అమరావతి బలైందని అన్నారు.
కేసులు పెట్టి భయపెడతారు, ఓ రోజు జైలుకు వెళ్తే ఏమౌతుంది. ? నా మీద కూడా కేసులు పెట్టారు.. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాను.. నేను భయపడే సమస్య లేదని అన్నారు. వడ్డితో సహా తిరిగి చెల్లించే రోజులు వస్తాయని అన్నారు. గుంటూరు కార్పోరేషనులో వైసీపీ గెలిస్తే అమరావతిని వారికి రాసిచ్చినట్టేనని గుంటూరులో నానీ ఓడిపోతే వైసీపీ బరి తెగిస్తుందని అన్నారు. మీకు రోషం లేదు రూ. 2 వేలు ఎవరూ ఇస్తే వాడికి ఓటేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.