నాగబాబుకు బాబు మోహన్ కౌంటర్ .. సంస్కారం లేని వ్యక్తులు !

మెగా హీరో నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు బాబు మోహన్. బాబుమోహన్ కు ప్రకాష్ పై ఎందుకు జలస్ ఉంటుందని.. తన తో ప్రకాష్ రాజ్ దేనిలో సమానం…? అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ ను చూసి ఆడిన సినిమాలు ఉన్నాయా…?? తాను చేసిన కొన్ని పాత్రల వల్ల 365 రోజులు హౌస్ ఫుల్ ఆడిన సినిమాలు ఉన్నాయని నాగబాబుకు చురకలు అంటించారు.

ఎక్కడి నుండో వచిన్న ప్రకాష్ రాజ్ తెలుగు వారిపై పెత్తనం చేయడం ఏంటి…?అసలు షూటింగ్ లో కాస్త ఇబ్బంది అనిపిస్తే వెళ్లిపోయే ప్రకాష్ రాజ్ కళాకారుల సమస్యలు తిరుస్తాడా…? అని నిలదీశారు.

నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయాలనే సంస్కారం లేని వ్యక్తి ప్రకాష్ రాజ్ అని.. తోటి కళాకారులను, ఆఖరికి ఇంట్లో వారిని కూడా చేసుకోలేని ప్రకాష్ రాజ్ మా సభ్యులను ఎలా చూసుకుంటాడని ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ పుట్టకముందే తెలుగు వారు జాతీయ అవార్డులు తీసుకున్నారని..పేర్కొన్నారు. నాగబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.