వైఎస్ఆర్ ఆసరా రెండో విడత నిధులు విడుదల..!

నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ వైయస్సార్ ఆసరా రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు. 17 కోట్ల 44 లక్షల చెక్ ను మహిళలలకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…ఆసరా రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 6400 కోట్ల నిధులు పంపిణీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 78 లక్షల మంది మహిళలు ఆసర పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు.

jagan
jagan

వైసిపి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారిపోయాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మహిళలకు సీఎం జగన్ ఇళ్ళను నిర్మించి ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ,సంక్షేమాన్ని చూసి ఓర్వలేని టిడిపి నేతలు కోర్టుల లో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లాను ఉన్నత మైన స్థాయిలో నిలబెడుతామని మంత్రి అనిల్ కుమార్ జిల్లా వాసులకు హామీ ఇచ్చారు.