కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందగా.. మరికొంత మంది కొలుకున్నారు. అయితే ఇపుడు తాజాగా నగరం లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో కరోనా కలకలం కలకలం సృష్టించింది. అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న షట్లర్ సిక్కిరెడ్డి కరోనా బారిన పడ్డారు.
ఆమెతో పాటు ఫిజియో థెరపిస్ట్ కిరణ్ జార్జ్ కూడా కరోనా వచ్చింది. అయితే కరోనా బారిన పడ్డ వీరిద్దరిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. కాగా, ఇదే అకాడమీలో పీవీ సింధు, బి. సాయి ప్రణీత్ లాంటి వారు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వెంటనే అకాడమీని క్లోజ్ చేశారు. రెండు రోజుల పాటు శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ తెరవనున్నారు. వీలైనంత త్వరగా మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్టు చెప్పింది.