తెలంగాణాలో కరోనా కేసులు రోజూ రెండు వేలకి దగ్గరలో నమోదవుతున్నాయి. ముందు కాస్త తగ్గినట్టు అనిపించినా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా తెలంగాణా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,921 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య, 88,396కు చేరింది. ఇక గడచిన 24 గంటల్లో తొమ్మిది మంది మరించారు. దీంతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 674కు చేరింది. గడచిన 24 గంటల్లో 1,210 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి దాకా మొత్తం 64,284 మంది డిశ్చార్జ్ అయ్యారు.
orona
తెలంగాణాలో ప్రస్తుతానికి 23,438 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి, అందులో 16,439 మంది ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండగా మిగతావారు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇక గడచిన 24 గంటల్లో 22,046 టెస్టులు చేయగా, ఇప్పటిదాకా చేసిన టెస్ట్ల సంఖ్య 7,11,196కు చేరింది. ఇక ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో కేసులు భారీగానే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 356 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరి లో 168 కేసులు, రంగారెడ్డిలో 134 కేసులు, సంగారెడ్డిలో 90 కేసులు నమోదయ్యాయి.