ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విశ్వేశ్వర ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. బ్యాంకు నుంచి 402 కోట్ల 79 లక్షలు లోన్ తీసుకొని దారి మళ్ళించారని ఆమెపై కేసు నమోదు చేశారు. బ్యాంకు అధికారులు బి కే జయప్రకాష్, కేకే అరవిందాక్షన్ కి కూడా ఐదేళ్ల శిక్ష వేసింది కోర్టు. 2017లో నమోదైన ఈ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది.
హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంతో పాటు ఆపిల్ కు వెళ్లారు కొత్తపల్లి గీత. దీంతో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామ కోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది న్యాయస్థానం. సిబిఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 16 కు వాయిదా పడింది.