శ్రీ విష్ణు “అల్లూరి” ట్రైలర్ రిలీజ్

-

ప్రయోగాత్మక సినిమాలతో అందరినీ మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వివిధ జోనర్స్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీ విష్ణు. తాజాగా మరో మూవీ తో ఆడియోస్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా.. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” అల్లూరి”. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా.. లక్కీ మీడియా బ్యానర్ పై అల్లూరి సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీ విష్ణు ఫుల్ లెన్త్ మాస్ రోల్ తో పాటు మొదటిసారి పోలీస్ పాత్ర చేస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలనుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ఫ్యాషన్, పవర్ తో, తెలివితేటలతో పనిచేసే అల్లూరి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు కనిపించబోతున్నాడు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news