భారతీయ రైల్వే బెంగళూరు బయ్యప్పనహల్లి స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దనుంది. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్‌డీసీ) ఈ స్టేషన్ అభివృద్ధి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందుకు గాను రూ.250 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఇక స్టేషన్ పునర్నిర్మాణ పనులను పూర్తయితే ప్రయాణికులకు అందులో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు లభిస్తాయి. ఇక ఈ ప్రాజెక్టుకును జూలై నుంచి ప్రారంభించనున్నారు.
బయ్యప్పనహల్లి రైల్వే స్టేషన్‌ను మొత్తం 26 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేయనున్నారు. ఇందులో భాగంగా సుస్థిరమైన స్టేషన్ భవన నిర్మాణం, సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే సౌకర్యం, గ్రీనరీని ఏర్పాటు చేయనున్నారు.
* ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయితే అందులో కొత్తగా కాన్‌కోర్స్ ఏరియా అందుబాటులోకి వస్తుంది. దాంట్లో ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏరియాలు, కెఫెలు, రెస్టారెంట్ల, ఫుడ్ కోర్ట్స్, రిటెయిల్ షాప్స్, కియోస్క్‌లు, ఎలవేటర్లు, ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయి.
* కాన్‌కోర్స్ ఏరియాలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు రిటైరింగ్ రూమ్స్, లాంజ్‌లు కూడా ఉంటాయి.
* స్టేషన్ మొత్తం అధునాతన ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, డిస్‌ప్లే వ్యవస్థలు ఉంటాయి. సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు కూడా ఉంటాయి.
* వృద్ధులు, వికలాంగులకు కావల్సిన సౌకర్యాలను కూడా ఈ స్టేషన్‌లో కల్పిస్తారు.
* స్టేషన్‌కు చాలా త్వరగా వెళ్లేందుకు సిటీలో రహదారుల కనెక్టివిటీని పెంచనున్నారు. కావల్సినంత పార్కింగ్ స్థలం ఉంటుంది.
ఇక ఇదే కాకుండా సూరత్‌లోనూ రైల్వే స్టేషన్‌ను ఇలాగే అప్‌గ్రేడ్ చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే హబీబ్‌గంజ్, గాంధీనగర్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఆ పనులు డిసెంబర్ 2020 వరకు పూర్తవుతాయి. కాగా గాంధీ నగర్ రైల్వే స్టేషన్‌ను 5 స్టార్ హోటల్‌ను పోలిన సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. భారతీయ రైల్వే ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు లభించడం గొప్ప విషయమే.. అయినా.. రైళ్లలో కావల్సినన్ని సీట్లు దొరికేలా చేయడం, రైళ్లను టైముకు నడపడం వంటి విషయాల్లో మెరుగు పడితే బాగుంటుంది.