ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ బాగా ఇబ్బంది పెడుతుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వస్తున్న ఈ వ్యాధి దెబ్బకు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ పడగ విప్పింది. జిల్లాలో 200 వరకు బ్లాక్ ఫంగస్ కేసులను అధికారులు గుర్తించారు. ఓ ప్రవేట్ ఆసుపత్రి లోనే 50 కేసులు ఉన్నాయని అంటున్నారు.
బ్లాక్ ఫంగస్ బాధితులకు కన్ను, దవడ తొలగించాల్సి వస్తుంది అని ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సుబ్బారాయుడు వెల్లడించారు. అనంత జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది.జిల్లా వాసులు ఇద్దరికి నిర్ధారణ అయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్త పడుతుంది. ముగ్గురు హిందూపురం వాసుల్లోనూ అనుమానిత లక్షణాలు ఉన్నాయి. స్టెరాయిడ్‌లు వాడిన ….కరోనా బాధితుల్లో టెన్షన్ మొదలైంది.