ఆ స్టార్ డైరెక్టర్ సినిమాతో బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ!

-

నటసింహ బాలకృష్ణ వేగం పెంచారు. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై అదరగొట్టేస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ‘అఖండ’తో ఘన విజయం సొంతం చేసుకున్న బాలయ్య.. మరో క్రేజీ ప్రాజెక్టు ‘ఎన్​బీకే 107’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో లేడీ పవర్​ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు అందిస్తున్నారు.

ఇదేకాక దర్శకుడి అనిల్‌ రావిపూడితో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించాడు బాలయ్య. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇప్పటి వరకు ఆయన కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేశారు. తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం ద్వారా బాలయ్య బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లోనూ రూపొందనుందని.. అలానే దీన్ని బాలీవుడ్‌లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని.. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను నటిస్తున్నారు. పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందని ఇప్పటికే తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news