మయన్మార్‌ జైలులో భారీ పేలుళ్లు.. 8 మంది దుర్మరణం

-

మయన్మార్‌ రాజధాని యంగూన్‌లో ఉన్న ఇన్‌సెన్‌ జైల్లో ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. జైలు ఎంట్రెన్స్‌ గేటు వద్ద రెండు పార్సిల్‌ బాంబులు పేలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జైలు ఉద్యోగులతో పాటు అయిదుగురు విజిటర్స్‌ ప్రాణాలు కోల్పోయారు.

 

మయన్మార్‌లో ఇన్‌సెన్‌ జైల్లో చాలా పెద్దది. ఈ కారాగారంలో సుమారు 10 వేల మంది ఖైదీలు ఉంటారు. అందులో ఎక్కువ శాతం మంది రాజకీయ ఖైదీలే ఉన్నారు. దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించుకోలేదు. ఈ పేలుళ్లలో మరో 18 మంది గాయపడ్డారు.

జైలులోని పోస్టు రూమ్‌లో బాంబులు పేలినట్లు అధికారులు గుర్తించారు. అదే రూమ్‌లో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు చుట్టి ఉన్న మరో బాంబు మాత్రం పేలలేదు. చనిపోయిన విజిటర్స్‌లో అందరూ మహిళలే ఉన్నారు. రాజధాని యంగూన్‌ శివారు ప్రాంతంలో ఈ జైలు ఉంది. దీనికి భారీగా భద్రత కూడా ఉంటుంది. వందేళ్ల క్రితం నాటి ఆ జైలులో ఖైదీలను అమానవీయ పద్ధతిలో ట్రీట్‌ చేస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news