బాలయ్య బాబు ఆ డైరెక్టర్ కు మాట ఇచ్చాడా.!

-

సినిమా పరిశ్రమలో పని చేసే వారికి టాలెంట్ తో పాటు, ముందు చూపు, అదృష్టం కూడా వుండాలి.  ఎందుకంటే ఒక సినిమా సెట్స్ మీద వుండగానే ఇంకో సినిమా సెట్ చేసుకొని రెడీ గా వుండాలి. లేకుంటే ఇంకో సినిమా చేయటానికి చాలా గ్యాప్ వస్తుంది. ఆ డైరెక్టర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా  వెంటనే మరో అవకాశం తెచ్చుకోవాలి అందుకే మన స్టార్ హీరోలు, డైరెక్టర్ లు వరసగా సినిమాలు ఒప్పుకుంటూ గ్యాప్ లేకుండా చూసుకుంటారు.

కాని ప్రస్తుతం టాలీవుడ్లో ఒక డైరెక్టర్ పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా వుంది. ఆ దర్శకుడే ఛలో’ ‘భీష్మ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల. ‘భీష్మ ‘సినిమా విడుదల అయ్యి రెండున్నర సంవత్సరాలు అయింది.కాని ఇప్పటి వరకు తన కొత్త సినిమా అప్డేట్ లేదంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.గతంలో తాను చిరంజీవికి కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడని, ఇక షూటింగు మొదలు పెట్టడమే తరువాయి అనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు సినిమా గురించి చిరంజీవి కూడా మాట్లాడటం లేదు. ప్రస్తుతం చాలా రోజులుగా సినిమా లేక నిరాశగా వున్నాడు.

ఈ మధ్య నందమూరి బాలకృష్ణ కు కథ వినిపిస్తే బాగా నచ్చి ఓకే అన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంటర్ టైన్ మెంట్ సూపర్ గా వుందట అందుకే బాలయ్య కు బాగా నచ్చిందట. ఎందుకంటే చాలా రోజులుగా తన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ తగ్గి పొయింది. అలాగే బాలయ్య బాబు మాత్రం ఎవరైనా ఇబ్బంది లో ఉన్నారంటే వెంటనే అభయం ఇచ్చేస్తాడు. ఇది చాలా సార్లు నిజం అయ్యింది. వాళ్ళు ప్లాప్స్ వున్నా కూడా మాట ఇచ్చాడంటే వెనక్కి తగ్గడు. ఇక ఈ సినిమా తో అన్నా ఈ హిట్ డైరెక్టర్ కెరియర్ గాడిలో పడుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news