‘బింబిసార’ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా?

-

బాలయ్య వీర సింహారెడ్డి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు అంటే గురువారం రోజున రూ. 25.36 కోట్లు వచ్చాయి. గ్రాస్ 54 కోట్లకు చేరింది. బాలయ్య కెరీర్ లో ఇదే అత్యధికం. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో… అత్యధిక వసూళ్లు చేసిన 15వ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది.

ఈ నేపథ్యంలోనే పుష్ప రికార్డును బ్రేక్ చేసింది వీర సింహారెడ్డి సినిమా. ఇది ఇలా ఉండగా, నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డి హిట్ అవడంతో తర్వాతి సినిమా ఏంటనే దానిపై చర్చ మొదలైంది. అయితే, బాలయ్య తర్వాతి సినిమాను బింబిసార సినిమా డైరెక్టర్ మల్లాడి వశిష్టతో తీయనున్నట్లు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. దీనిపై అతి త్వరలో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news