NBK 107 నుంచి బాలయ్య ఫోటోలు వైరల్ !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే హీరో నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో వచ్చిన అఖండ సినిమా… బంపర్‌ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే… మరో బిగ్‌ ప్రాజెక్టు ను ఓకే చేశారు నందమూరి బాలయ్య.

క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ యూనిట్ కు లీకుల బెడద ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య లుక్ బయటకు వచ్చింది. దీంతో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లుక్ ను చూసిన జనాలు షాక్ కు గురి అవుతున్నారు. వెరీ పవర్ఫుల్ లుక్ లో బాలయ్య కనిపించాడు. అయితే ఈ లీకుల పై చిత్రబృందం కూడా స్పందించింది. ఎవరూ కూడా దయచేసి లింకులను స్పీడ్ చేయకూడదంటూ చిత్ర బృందంతో పాటు బాలయ్య కొడుకు రిక్వెస్ట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news