బ్రేకింగ్ : పురంధరేశ్వరి ఇంటికి బాలయ్య.. కారణం ఇదే

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య… ఆయన చెల్లెలు, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంటికి వెళ్లారు. ప్రకాశం జిల్లా కారంచేడు లో ఉన్నటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంటికి కుటుంబ సభ్యులతో సహా నందమూరి బాలయ్య వెళ్లారు. భోగి, సంక్రాంతి వేడుకల్లో భాగంగా బాలయ్య బాబు దగ్గుబాటి పురందేశ్వరి ఇంటికి వెళ్లారు. ఇక బాలయ్య అక్కడికి… ఆయన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

ఇక కారంచేడు కు చేరుకున్న బాలయ్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు రోజులపాటు కారంచేడు లోనే బాలయ్య ఉన్నారని తెలుస్తోంది. పండుగ వాతావరణం పూర్తి అయ్యాక తిరిగి హైదరాబాద్ రావాలన్నారు బాలయ్య.కాగా నందమూరి బాలయ్య ఇటీవల నటించిన అఖండ సినిమా గ్రాండ్ విక్టరీ అందుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలైన అఖండ సినిమా.. ఇప్పటికి కూడా థియేటర్లలో దుమ్ము లేపుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది అఖండ సినిమా. జై సినిమా జనవరి 21వ తేదీన హాట్ స్టార్ వేదికగా పోటీలో విడుదలకానుంది.