F3 మూవీ చూసిన బాలయ్య..నటసింహం ఇచ్చిన రివ్యూ ఇదే..

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 3.. సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. జనాలు థియేటర్లలో ఈ సినిమాను చూసి తెగ నవ్వుకుంటున్నారు. కాగా, ఈ చిత్రాన్ని తాజాగా నందమూరి నటసింహం బాలయ్య..అనిల్ రావిపూడితో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారు.

ఇక ఈ పిక్చర్ చూసిన అనంతరం బాలయ్య… మూవీ యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. సినిమా ఆద్యంతం నవ్వులు పూయించేలా దర్శకుడు అనిల్ రావిపూడి చక్కగా తెరకెక్కించారని బాలయ్య మెచ్చుకున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని పేర్కొన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ సినిమా చేయనున్నారు. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ గా ఉండబోతుందని సమాచారం. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో NBK107 సినిమా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news