అన్ స్టాపబుల్ షో తో బాలయ్య ప్రపంచ స్థాయిలో..!!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటే ఇక వచ్చే ఎపిసోడ్స్ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపి చంద్ ఎపిసోడ్ ట్రైలర్ మాత్రమే చూపించినా యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో ట్రెండింగ్ లో హల్చల్ చేసింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో మరో సారి అదిరిపోయేలా ఉంది.

ఇక ఈ షోస్ తో ఎక్కడలేని పాపులారిటీ ఆహా కు వచ్చింది. ప్రస్తుతం ఈ షో క్రేజ్ ను వాడుకోవడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉందనే వార్త హంగామా సృష్టిస్తోంది అన్ స్టాపబుల్’ మొత్తం ఎపిసోడ్ లను ప్రసారం చేయడానికి సీజన్ 01 – సీజన్ 02 రెండింటినీ కొనుగోలు చేసేందుకునెట్ ఫ్లిక్స్ భారీ డీల్ ను కుదుర్చుకుందని టాక్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సహా ప్రభాస్ ఎపిసోడ్ లను ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఒకేసారి ప్రసారం చేయాలని ఆశిస్తోందని తెలుస్తోంది. ప్రభాస్- పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ లు అన్ స్టాపబుల్ ను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయేలా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news