సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌..

-

తెలంగాణ దశాబ్ది వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో ఓవైసీ పాల్గొనలేదని, దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయనందుకు దారుస్సలాంకు తాళం వేసే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందా? అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదని బండి సంజయ్ చిట్ చాట్‌లో తెలిపారు. నిజమైన ముస్లింలు ఎంఐఎం పార్టీని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్నెళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు పంచుతామని బండి సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.

Bandi Sanjay: బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం | BJP Leader Bandi  Sanjay Hyderabad Telangana Suchi

ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బండి ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మారడం తనకు చేతకాదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం కూడా తనకు చేతకాదన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని చురకలంటించారు. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో వాళ్లే చెబుతారన్నారు. తనకు పార్టీ నడపడం చేతకాకుంటే హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా గెలిచామో చెప్పాలన్నారు. సొంత పార్టీ నేతలపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం కూడా తనకు చేతకాదన్నారు. తాము గెలుపు పరంపరం కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయి ఓటమి పరంపర సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news