అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు మోడీ పాలనే కోరుకుంటున్నారు : బండి సంజయ్‌

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటన ముగిసింది. ఈనెల 1న అమెరికా వెళ్లిన బండి సంజయ్ గత 10 రోజులుగా యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యారు. సెప్టెంబర్ 2,3 తేదీల్లో అట్లాంటా జార్జియాలో, 4న నార్త్ కరోలినాలోని చార్లెట్ ఎన్సీ, 5న రాలై, 6న వాషింగ్టన్ డీసీ, 7న న్యూయార్క్, 8న న్యూజెర్సీ, 9న డల్లాస్ లో, 10న ఫ్రిస్కో టెక్సాస్ ప్రాంతాల్లో పర్యటించిన బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా ఎన్నారైలు ముఖ్యంగా తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజాస్యామ్య తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని ఈ సందర్బంగా సంజయ్ కోరారు.

Voices against Bandi Sanjay within BJP get louder, spill out on social  media-Telangana Today

కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన ఎంపీ బండి సంజయ్.. తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బండి సంజయ్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా దేశంలో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు బండి సంజయ్ తెలిపారు. ఇండియాలో ఎన్ఐఆర్ లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అన్నీ ఇన్నీ కాదని..అందుకే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. భారతీయులందరూ అమెరికాలో గల్లా ఎగిరెసుకొని తిరుగుతున్నామంటే అమెరికాలో మోదీకి ఉన్న గౌరవమే అని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news