మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ చేరికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమయాన్ని బట్టి ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఎదో ఒక రోజు పార్టీలో ఈటల చేరే అవకాశం ఉందన్నారు. ఆ రోజుల్లోనే చేరాలని ఈటల కూడా అనుకుంటున్నాడని పేర్కొన్నారు బండి సంజయ్. ఆనంతరం కెసిఆర్, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని..కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అంటే నాకు అభిమానం.. గౌరవమని పేర్కొన్నారు. ఈటల ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనటం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు.
బీసీలు, దళితులకు టీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదని..ప్రైవేట్ ఆసుపత్రులను కంట్రోల్ చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రమంత్రిగా కేసీఆర్ అవినీతికి పాల్పడితే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో అన్ని బయట పెడతామని పేర్కొన్నారు. ఇతర పార్టీల కామెంట్స్ పై మేము స్పందించబోం…మా పంథా మాకు ఉందన్నారు. ఈటల రాజేందర్ ని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే స్థాయికి కాంగ్రెస్ నాయకులు వచ్చారని తెలిపారు. ఈటల రాజేందర్ బీసీ నాయకుడు కాదా.. trsలో చేరితే బిసి.. బయటకు పంపిస్తే కాడా ? అని ప్రశ్నించారు. trsలో రమణ చేరుతున్న విషయం తనకు తెలియదన్నారు.