ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి చెక్ పెట్టేలా అధికార టీఆర్ఎస్ రాజకీయాలు ఉంటున్న విషయం తెలిసిందే.. అనూహ్యంగా బీజేపీకి చెక్ పెట్టడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి ముందుకెళుతున్నారు.. ఇలా కేసీఆర్ రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది.. ఇక ఆయన చేసే రాజకీయానికి కౌంటర్లు ఇవ్వడంలో బీజేపీ కాస్త వెనుకబడిపోయిందనే చెప్పాలి.. మొన్నటివరకు బీజేపీ, టీఆర్ఎస్‌తో పోటీగా ఉండేది.. కానీ ఈ మధ్య మాత్రం కాస్త బీజేపీ తగ్గింది.
కొన్ని అనూహ్య పరిణామాలు రేసులో బీజేపీ వెనుకబడేలా చేసింది.. ఇక తాజాగా శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసు రావడం, ఇందులో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని పోలీసులు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో రాజకీయం మరో మలుపు తిరిగింది. ఇక ఇందులో నిజనిజాలు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేవు..కానీ అరుణ, జితేందర్ పేరులు రావడం కాస్త బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.
ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఎటాక్‌కు ప్లాన్ చేశారు.. ఇలాగే ముందుకెళితే కేసీఆర్ రాజకీయంగా ఏదైనా చేస్తారని చెప్పి.. బండి దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.. శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం అనేది ఒక కుట్ర అని, ఆయన అవినీతిని బయటపడకుండా టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుందని, కావాలని కుట్ర పన్ని అరుణ, జితేందర్‌లని ఇరికించాలని చూస్తున్నారని చెప్పి బండి తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు..అలాగే అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నించాలని చెప్పి దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్.. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు, ప్రతిపక్షాలను తన ట్రాప్‌లోకి నెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని, కేసీఆర్ ట్రాప్‌లో పడకుండా ప్రజా సమస్యలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే ఈ మధ్య టీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలని బీజేపీలో వరుసపెట్టి చేర్చుకుంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు బండి సంజయ్..కారుకు కౌంటర్ ఎటాక్ రెడీ చేస్తూనే ఉన్నారు.