రైతుల ఆత్మహత్యలలో తెలంగాణది నాలుగో స్థానం: బండి సంజయ్

సిఎం కెసిఆర్ పై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ దీక్ష చేస్తే కేంద్రం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్.. సిఎం కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని నిలదీశారు. సిఎం కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడు.. మేము రైతుల కోసం ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు బండి సంజయ్.

ఉద్యమం లో చనిపోయిన రైతులకు రూ. 20 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ అంటున్నాడని పేర్కొన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని.. 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు బండి సంజయ్.. వీళ్లందరికీ కేసీఆర్ రూ.20 లక్షలు ఇస్తాడా ? అని నిలదీశారు బండి సంజయ్. సిఎం కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి పోయాడో మాకు తెలియదని ఎద్దేవా చేశారు బండి సంజయ్. 4 వందల మంది ఆత్మబలిదానం చేసుకుంటే కానీ తెలంగాణ రాలేదని…  అలాంటి అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.