తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో అర్ధం కావడం లేదు…రాజకీయంగా ఎవరు ఎప్పుడు పై చేయి సాధిస్తారో తెలియడం లేదు. అలాగే రాజకీయంగా ఏ పార్టీ ముందు వరుసలోకి వస్తుందో క్లారిటీ ఉండటం లేదు. ఎప్పటికప్పుడు లీడింగ్ మారిపోతూ వస్తుంది. మొత్తానికైతే టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. టోటల్ గా ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది.
అయితే ఈ ట్రైయాంగిల్ ఫైట్ లో టీఆర్ఎస్ రాజకీయంగా లబ్ది పొందేందుకు చూస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే మళ్ళీ తాము అధికారంలోకి రావోచ్చు అనేది కేసీఆర్ వ్యూహంగా ఉందని తెలుస్తోంది. అందుకే సమయానికి తగ్గట్టుగా ఆయన…బీజేపీని టార్గెట్ చేయడం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకముందు ఈయన..కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఇక ఇప్పుడు బీజేపీపై ఫోకస్ పెట్టారు.
అంటే కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ బలం పెంచితే ఓట్లు చీలిపోతాయనేది కేసీఆర్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు బీజేపీ రేసులో ముందుకొస్తుంది…దీంతో ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ మార్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది…టీఆర్ఎస్ పార్టీతో ధీటుగా ఎదిగింది. ఇక కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది.
అయితే బీజేపీ బలం తగ్గించాలంటే కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలి…ఇప్పుడు కేసీఆర్ అదే పనిలో ఉన్నారని బండి అనుమానిస్తున్నారు. ఎందుకంటే తాము అధికార టీఆర్‌ఎస్ తో కొట్లాడుతూ ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం తమకు పోటీగా కార్యక్రమాలు చేస్తోందని, కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కష్టపడుతున్నారని అంటున్నారు.
అంటే కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెంచితే…బీజేపీకి పోటీగా వస్తుంది. అప్పుడు రెండు పార్టీల మధ్య ఓట్ల చీలితే తమకే బెనిఫిట్ అనేది కేసీఆర్ కాన్సెప్ట్..అందుకే కాంగ్రెస్ పై బండి డౌట్ పడుతున్నారు..మరి ఈ విషయంలో ఎక్కడ తేడా కొట్టకుండా…కేసీఆర్ వ్యూహాలని భగ్నం చేసుకుంటూ వెళితే బీజేపీకి ప్లస్…లేదంటే మళ్ళీ టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది.