కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తుండు :బండి సంజయ్

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్లర వ్యవహారమని చెప్పడం అత్యంత దురదృష్టకరమన్నారు బండి సంజయ్. నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమని బండి సంజయ్ గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి మేరకే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని బండి సంజయ్ చెప్పారు. విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు బండి సంజయ్.

BJP to form 34,000 booth committees with 6.8 lakh members: Bandi Sanjay

రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది నిజం కాదా? అని ప్రశ్నించారు బండి సంజయ్. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. “రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను సీఎం కేసీఆర్ ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నది నిజం కాదా?

కేంద్రం నిధులను జీతాలకు మళ్లిస్తోంది నిజం కాదని సీఎం చెప్పాలి.. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ చేతగానితనం వల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నారు.’ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news