మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై టీఆర్‌ఎస్, బీజేపీ నేతలపై మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్పై నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్. ఈ క్రమంలో బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ నుంచి యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఆయన వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. యాదగిరి గుట్టలో ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకుంటామని బండి తేల్చి చెప్పారు.
సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. పోలీసులు అడ్డుకున్నా తాను యాదగిరిగుట్టకు వెళ్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ సవాల్తో యాదగిరిగుట్టలో హై టెన్షన్ నెలకొంది. యాదాద్రికి వస్తే ఆయనను అడ్డుకోవాలని స్థానిక టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగనుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.