తెలంగాణలో ఆకుపచ్చని జెండాలను ఎగరనివ్వం… బంగాళాఖాతంలో కలిపేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆకుపచ్చని తెలంగాణ నే బీజేపీ లక్ష్యమని.. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలి… శృతి మించి ఉండడం మంచిది కాదని హెచ్చరించారు. ఇవాళ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న బండి సంజయ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అమ్మవారి కరుణ, కటాక్షం కలిగించించే అవకాశం కల్పించిన స్వర్గీయ PJR గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని.. రాజకీయాలు ఏం మాట్లాడాల్సి వచ్చినా PJR లేకుండా మాట్లాడలేమని చెప్పారు.
అంతగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని.. ప్రజా సంగ్రామ యాత్ర 2 వ విడత పాదయాత్రలో… 31 రోజుల్లో 383km పూర్తి చేసుకున్నామని తెలిపారు. అమిత్ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందని.. అమిత్ షా సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిదన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే…నిలువ నీడలేని అర్హులైన పేదలందరికి ఇండ్లను నిర్మించి ఇస్తామని.. బీజేపీ అధికారంలోకి రావాలని పేదలందరు కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తాం… ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. వ్యాట్ ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామన్నారు. ఫసల్ భీమా యోజన అమలు చేస్తామని.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ… కోటీశ్వరుడు అవుతుంటే… రైతులు మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో బికారులు అవుతున్నారని ఆగ్రహించారు.