అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు…పీరు లేవదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అవినీతి చేస్తున్నారని తెలిసికూడా మీ పాతమిత్రుడు KCR ని అరెస్ట్ చెయ్యరని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకంలో వాటా ఉందన్న మీరు.. KCR అవినీతిలో మీకువాటాలెదంటే నమ్మాలా? అని ఆగ్రహించారు.
8 ఏండ్లుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిచ్చారని ఇక తెలంగాణలో కూడా ఇస్తారా? అని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉండికూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనని మీరు.. తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా? అని ఆగ్రహించారు.
రైతులను కార్లతో గుద్దిచంపిన మీరు మా రైతాంగాన్ని ఆదుకుంటామని చెవిలో పూలు పెడుతున్నారా? అని.. చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదు ఇక ఎం మొహం పెట్టుకొని ఒక్క చాన్స్ ఆడుగుతున్నారు? అని ఫైర్ అయ్యారు. మైనార్టీలను బలిపశువులను చేసి అధీకారపీఠాలను ఎక్కుతున్న మీరు….. వాళ్లకున్న 4% రిజర్వేషన్ తీసెయ్యడం కాకుండా ఇంకేం ఆలోచించగలరు ? అని ప్రశ్నించారు. YSR గారు ఇచ్చిన రిజర్వేషన్ మోడి షా కలిసొచ్చినా పీకెయ్యలేరని.. మీ మతోన్మాదాన్ని ఎదిరించగలగేది YSR స్పూర్తి మాత్రమేనన్నారు వైఎస్ షర్మిల.