పౌరుషం ఉంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే… కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలి : బండి సంజయ్‌

నిర్మల్‌ జరిగిన సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి భయపడేది లేదని… అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పౌరుషం ఉంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

తెలంగాణ ను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు, ఒక ముక్కను ఎంఐఎం కు ఇచ్చారని… ఎందుకు నిర్వహిస్తలేరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి మూర్కుడు దేశ ప్రధాని అయితే స్వాతంత్ర్య దినోత్సవం తేదీ కూడా మారుస్తాడని… రాష్ట్రంలో అధికారంలో కి వస్తాం, నీ చరిత్ర ను భూ స్థాపితం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ నీచ చరిత్ర ను కూడా పాఠ్యం శంలో చేరుస్తామని.. గొల్లకొండ ఖిల్లా పై కాషాయ జెండా ఎగుర వేస్తామని స్పష్టం చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మూర్ఖుడి చేతిలో బందీ అయిందని…. తెలంగాణ తల్లి రోదిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.