కడుపు ఉబ్బరం సమస్యని ఇలా తరిమేయండి..!

కొన్ని కొన్ని సార్లు కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి అని చాలా మంది కంగారు పడిపోతుంటారు. అయితే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలు పాటించండి. నిజంగా ఈ టీ ని కనుక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వెంటనే రిలీఫ్ ఇస్తుంది. అయితే మరి ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ఈ అద్భుతమైన ఔషధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం దీని కోసమే పూర్తిగా చూసేయండి.

 

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఈ విధంగా టీ తయారు చేసుకుని తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల ఈజీగా సమస్య నుండి బయటపడవచ్చు. అయితే మరి ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

కావలసిన పదార్థాలు:

ఒక గ్లాసు నీళ్ళు
ఒక టీ స్పూన్ వాము
అర టీ స్పూన్
ఎండిన అల్లం పొడి లేదా తాజా అల్లం ముక్క
5 నుండి 7 పుదీనా ఆకులు
ఒక టేబుల్ స్పూన్ ఉసిరిపొడి

తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా గ్లాసు నీళ్ళలో వాము, అల్లం, పుదీనా వేసి ఉసిరి పొడి కూడా వేసి కలుపుకోవాలి. దీనిని నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు మరిగించి తీసుకుంటే వెంటనే కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. కాబట్టి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఇలా ఫాలో అయిపోండి.