BRS నేతల కొడుకులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారు – బండి సంజయ్

-

BRS నేతల కొడుకులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారని బాంబ్ పేల్చారు బండి సంజయ్.తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారు. ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారన్నారు.

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ TSPSC స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోంది. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా మెయిన్స్ కు అర్హత సాధించారు. ఒక చిన్న గ్రామం నుంచే 6 గురు క్వాలిఫై అయ్యారు. వీళ్లంతా ప్రతిభావంతులు అనుకుంటే పొరబాటే… బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లు కావడం వీళ్లకున్న ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news