మరోసారి బండి సంజయ్‌ పాదయాత్ర..?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ మరోసారి పాదయాత్ర చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరోసారి ఆయనతో పరిమిత పాదయాత్ర చేయించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అధిష్ఠానం నుంచి సూచనలు రావడంతో బండి సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు.

Bandi Sanjay | ఓబీసీలకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే: బండి  సంజయ్‌-Namasthe Telangana

ఈ పాదయాత్ర ఈ నెల 7వ తేదీన కరీంనగర్ పట్టణం నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికలకు మరెంతో సమయం లేనందున కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాలలో పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడో తేదీన కరీంనగర్‌లో ప్రారంభమయ్యే పాదయాత్ర 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో ఉండనుంది. బుల్లెట్ ప్రూఫ్ కారుతో ఆయన ప్రచారం చేయనున్నారు. మరోవైపు, తనకు అధిష్ఠానం కేటాయించిన హెలికాప్టర్‌తో ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news