తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ములుగు లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల మీటింగ్ లో కీలక విషయాలు చర్చించారు. రానున్న అసబ్లీ ఎన్నికల్లో పార్టీని ఒక్క ములుగు లో ఏ విధంగా గెలిపించుకోవాలో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎగిరేది బీజేపీ జెండా అని ఘంటాపథంగా చెప్పారు. సర్వేలు ఏమి చెప్పినా జరిగేది అదే అని చెప్పారు. బండి సంజయ్ కేసీఆర్ గురించి మాట్లాడుతూ .. పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అతఃపాతాలానికి తొక్కేస్తున్నాడని రెచ్చిపోయి మాట్లాడారు. ఆయన చెప్పిన హామీలలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒకటి..కానీ ఏమైంది అది తెరవడం సంగతి అలా ఉంచితే… ఉన్న కంపెనీ లనే మూసేస్తున్నాడు. కానీ ప్రధాని మోదీ మాత్రం రామగుండంలో మూతపడిన యూరియా ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు.
ఈ క్షణం కేసీఆర్ ఒక లెటర్ ఇస్తే మేము నిజం సుగర్ ఫ్యాక్టరీ నీ ఓపెన్ చేస్తాము అంటూ సవాల్ చేశాడు. ఇలా అనేక విషయాల పైన బండి సంజయ్ కేసీఆర్ చేతకాని తనాన్ని గురించి కథలు కథలుగా చెప్పాడు. మరి బండి సంజయ్ ముందుగా చెప్పినట్లుగా ములుగు లో బీజేపీ గెలుస్తుందా చూడాలి. కాగా ప్రస్తుతం ములుగు లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సీతక్క ఎమ్మెల్యే గా ఉంది.