బిడ్డా.. నీ అర్హత సీఎం కొడుకు మాత్రమే.. కేటీఆర్‌పై బండి ధ్వజం

-

బిడ్డా.. నీ అర్హత సీఎం కొడుకు మాత్రమే.. కేసీఆర్ లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవు అంటూ బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని జీవితం నీది.. వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్.. ప్రజల సొమ్మును దోచుకున్నది నిజం కాదా? లక్షలు, కోట్ల ఆశచూపి బీజేపీ నేతలను బీఆర్ఎస్ లోకి లాక్కోవాలని చూస్తున్నారు. థూ… ధైర్యంగా కొట్లాడే దమ్ములేని బతుకు మీది.. పొరపాటున కేసీఆర్ మళ్లీ అధికారంలోకొస్తే… తెలంగాణ పరిస్థితి శ్రీలంక మాదిరిగా మారుతుంది.. ఆ పరిస్థితి రాకూడదంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ కోరారు. ఢిల్లీ గులాంలు మాకొద్దని చెబుతున్న కేసీఆర్… ఆ కుటుంబానికి తెలంగాణ ప్రజలు గులాం కావాల్నా? గతంలో గుజరాత్ బిడ్డకే వంగి వంగి పాదాభివందనం చేసిన సంగతి మర్చిపోయినవా? అని బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay in Delhi to discuss BJP's Assembly elections strategy

సీఎం కేసీఆర్‌పై కూడ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌తో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ముడుపులకు లొంగిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీని వల్లే ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాల వాటా తేల్చడం ఆలస్యమైందని అన్నారు. ఇక, సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా కనపడటం లేదని.. వినాయక చవితి రోజు చివరగా కనిపించారని.. తండ్రి ఎక్కడున్నారో మంత్రి కేటీఆర్ చెప్పాలని బండి డిమాండ్ చేశారు. కేటీఆర్ సీఎం అని కేసీఆర్ ప్రకటిస్తే.. వచ్చే ఎన్నికల్లో సగం మంది ఎమ్మెల్యేలు అసలు పోటీనే చేయరని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news