కెసిఆర్ …తన పొలంలో గంజాయి పండిస్తున్నాడు : బండి సంజయ్

వికారాబాద్ జిల్లా : తెలంగాణ జిల్లాల్లో బిజేపి రాష్ట్ర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యం లోనే వికారాబాద్ జిల్లా లో పర్యటించిన బండి సంజయ్.. సిఎం కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరు తో రైతులకు వచ్చే పథకాలను ఎత్తేశాడని మండి పడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని కిసాన్ యోజ్ అర్హులైన అందరికీ అందజేస్తుంటే… రాష్ట్రంలో రైతు బంధు మాత్రం ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ అమలు చేస్తుందని మండిపడ్డారు.

రైతులందరిని సన్న వడ్లు పండియ్యమని.. తాను మాత్రం దొడ్డొడ్లు పండించాడని నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ కు 300 ఎకరాల మాగాణి ఉన్న ఫాంహౌస్ ఉందని తానే చెప్పాడు… ఎకరా పోలంలో కోటి పంట పండిస్తున్నానని కెసిఆర్ చెప్పాడని గుర్తు చేశారు. కెసిఆర్ ఎకరా పోలంలో కోటి పంట పండిస్తే.. రైతులెందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారో చెప్పాలని.. తన పొలంలో గంజాయి పండిస్తుండా ? లేక బంగారం పండిస్తుండా ? చెప్పాలని నిప్పలు చెరిగారు. రైతులందరి దీవేనలతో 2023 లో అధికారంలోకి బీజేపీ వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.