టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ, ఎంఐఎం తాలిబన్ పార్టీ : బండి సంజయ్

సంగా రెడ్డి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ అని.. ఎంఐఏం తాలిబన్ పార్టీ అని ఎద్దేవా చేశారు.  హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయని దళిత బంధు ప్రకటించాడని… ఉప ఎన్నికలు వస్తేనే దళిత బంధు వస్తుందని చురకలు అంటించాడు బండి సంజయ్‌. కేసీఆర్ మెడలు వంచి సెప్టెంబర్ 17 ను నిర్వహించేలా చేస్తామని… కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని నిప్పులు చెరిగారు.

తెలంగాణ కోసం 1400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబము లో అందరికి ఉద్యోగాలు వచ్చాయని ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ లో ఉన్నా, ఇక్కడ ఉన్నా కేసీఆర్ పీకెది ఏమి లేదని… నిజమైన ఉద్యమకారుడు కాళోజీ అని తెలియజేశారు. అయితే ఫార్మ్ హౌస్, లేదంటే ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉంటాడని చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వం లక్షలు కోట్లు రాష్ట్రానికి ఇస్తుందని… ఫార్మ్ హౌస్ లో ఉన్న కుక్క కి ఉన్న విలువ పేదలకు లేదా ? అని మండిపడ్డారు.