రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన ముందు చూపు ఎవరికీ లేదనేంతగా ఆయన రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఈ విషయంలో ఆయన గతంలోనే ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వ్యూహాలు ఎవరి ఊహకు కూడా అందరకుండా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో ఆయన మరో వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తూ సంచలనం రేపుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
ఎందుకంటే ఎలాంటి వ్యూహం లేకుండా కేసీఆర్ ఢిల్లీలో ఇన్ని రోజలు ఉండరు కదా. ఇక కేంద్ర పెద్దలను ఎందుకు కలుస్తున్నారనేదానిపై రాష్ట్ర బీజేపీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇక్కడ ఓ విషయం ఏంటంటే కేసీఆర్ ఢిల్లీలో మోడీని కలిసిన తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక కరోనా నేపథ్యంలో ఇప్పట్లో లేదని ఈసీ ప్రకటించింది. అంటే కేసీఆర్ ఎఫెక్ట్‌తోనే ఇలా జరిగిందని అర్థమవుతోంది. ఇక అమిత్ షాతో పాటు కేంద్ర పెద్దలను కూడా యన కలుస్తున్నారు.
ఇదే ఇప్పుడు రాష్ట్ర బీజేపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు బీజేపీ నేతలు ఇక్కడ యాత్రలు, సమావేశాలతో హోరెత్తిస్తుంటే మరోవైపు కేసీఆర్ ఢిల్లీలో కూర్చుండి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. దీంతో అసలు కేసీఆర్ ఎలాంటి ప్లాన్ వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదేమైనా కేసీఆర్ వల్ల ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలు వాయిదా పడటం బీజేపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక రేపు కేసీఆర్ తెలంగాణకు వచ్చి నిధులు కావలంటే మోడీ ఇవ్వలేదని బీజేపీపై విమర్శలు కూడాచేసే అవకాశం ఉంది. మొత్తానికి కేసీఆర్ చేస్తున్న పనులు బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి.