ఆర్మీలో చేరాలనుకునే వారు ఇలా విధ్వంసం చేయరు – బండి సంజయ్

-

అగ్నిపథ్ మంచి స్కీమ్ అని కేంద్రాన్ని కావాలని కొందరు బద్నాం చేస్తున్నారని ఆగ్రహించారు తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కామెంట్స్. నిరసన చెప్పే పద్ధతి ఇది కాదని.. ఆర్మీలో సేవ చేయలనుకునే యువకులను 40 వేల మంది రిక్రూట్ మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రిక్రూట్ మెంట్ లో పది శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు..

ఆర్మీలో పనిచేయాలని సేవ చేయాలని అనుకున్న వాళ్లకు మంచి అవకాశం ఇది.. దేశ భద్రత విషయంలో మంచి పథకం వస్తే స్వాగతించాలని కోరారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుంది.. సికింద్రాబాద్ లో విధ్వంసం చేసింది ఎవరు ? అని నిలదీశారు.

రాళ్లు ఎవరు వేసారో తెలియలేదని యువకులు చెప్తున్నారు.. ఆర్మీలో పనిచేయాలనుకునే వాళ్ళు ఇలాంటివి చేయలేదు.. విధ్యంసం చేసింది ఎవరో గుర్తించాలని డిమాండ్‌ చేశారు. రైల్వే గోడలు కూల్చారు అంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటనా… పెట్రోల్ లో కాల బెట్టడం గ్రానైట్ పగల గొట్టడం ఎలా జరుగుతుందన్నారు. ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చినా పట్టించుకోలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే సంఘ విద్రోహ శక్తులు కుట్ర జరిగిందని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news