రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డి అరెస్ట్.. ఘట్కేసర్ టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత

-

మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్ బయలుదేరారు. కాగా ఘట్కేసర్ లో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి తో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

రేవంత్ ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ను తరలిస్తున్న వాహనం ముందు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చంపింది టిఆర్ఎస్ పార్టీ.. చంపించింది బిజెపి. మేము వరంగల్ కి వెళ్తే వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ మంత్రులు శవయాత్ర చేయొచ్చు కానీ మేము వెళ్లి కుటుంబాన్ని పరామర్శిస్తామంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ చావులను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలను ఎక్కువకాలం మోసం చేయలేరని.. త్వరలోనే సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news