రాజకీయాల్లో నేతల వారసులతో చాలా ఇబ్బంది అని చెప్పవచ్చు. వారసుల వల్ల ఒకోసారి ప్లస్ ఉంటే..ఒకోసారి మైనస్ అవుతుంది. తండ్రుల పదవులని అడ్డం పెట్టుకుని వారసులు హడావిడి చేయడం, వివాదాల్లో చిక్కుకోవడం జరుగుతుంది. దీని వల్ల నేతలకు పెద్ద తలనొప్పి ఎదురవుతుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు అదే పరిస్తితి ఎదురైంది. బండి వారసుడు సాయి భగీరధ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్శిటీలో చదువుతున్న సాయి భగీరధ్.. ఓ విద్యార్థిని చితకబాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ దాడి ర్యాగింగ్ కారణంగా చేశారా.. మరో వివాదమా అన్నదానిపై స్పష్టత లేదు. మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు భగీరధ్‌పై కేసు నమోదు చేశారు. అసలే కారు పార్టీపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న బండిని ఎక్కడ ఇరుకున పెడదామా అని చెప్పి గులాబీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రమంలో బండి వారసుడు వీడియో బయటకు రావడంతో దానిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
Ragging & assaulting case of @BJP4Telangana president @bandisanjay_bjp ’s son. Hitting, kicking & abusing his colleague student at university!
The student is now hospitalised. Will Mr @JPNadda dare to comment on this? pic.twitter.com/3B8F9E8wZF
— YSR (@ysathishreddy) January 17, 2023
అయితే ఈ అంశంపై బండి కూడా స్పందించారు.. తన కొడుకుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని, తన కొడుకు మందు కోసం కాజాగూడలో గొడవ చేయలేదన్నారు. అలాగే పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు.. మళ్లీ కలుకుంటారని, అయినా తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారా.. ప్రోసిజర్ ఫాలో అయ్యారా.. అని పోలీసులను ప్రశ్నించారు.
ఇక భగీరధ్ చేతుల్లో దెబ్బలు తిన్న బాధితుడు కూడా స్పందించినట్లు తెలిసింది. భగీరథ్ వాళ్ల ఫ్రెండ్ చెల్లెలిని ప్రేమించాలంటూ ఫోన్లు, మెస్సేజ్‌లు చేసి విసిగించానని.. అది తెలిసి భగీరథ్ తనను నిలదీశాడని కాకపోతే ఆ టైమ్ లో కాస్త ఎక్కువగానే మాటలు తూలటంతో… కోపంతో భగీరథ్ తనని కొట్టాడని వివరించారు. ఆ తర్వాత.. తాము కలిసిపోయామని..స్నేహితులమని చెప్పాడని తెలిసింది. మరి చూడాలి ఇందులో కుట్ర కోణం ఉందా? లేక స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవేనా అనేది తేలాల్సి ఉంది.