తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం.. మేం అధికారంలో వస్తే తక్షణమే తీసుకొస్తాం..

-

తెలంగాణ బీజేపీ ఛీప్ బండిసంజయ్, ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్న బండి సంజయ్, కేసీఆర్ పై, తెలంగాన ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. సంగారెడ్డిలో మాట్లాడిన బండి సంజయ్, ఉత్తరప్రదేశ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ జనాభా నియంత్రన చట్టాన్ని తీసుకువస్తామని, 2023లో అధికారంలోకి రాగానే జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు.

ఇదిలా ఉంటే ప్రజాసంగ్రామ యాత్ర మొదలై పదిరోజులు దాటిపోయింది. వికారాబాద్ సహా సంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించారు. కాలినడకన ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తూ, వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తున్నారు. పదునైన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక దగ్గరలో ఉన్న సందర్భంలో ఈ పాదయాత్ర ఏ మేరకు ఫలితాలనిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news