తిరుమల: ఉచిత దర్శనం టికెట్ల కోసం భక్తుల రద్దీ.. ఆ జిల్లావాసులకు మాత్రమే..

-

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు సర్వదర్శనం టికెట్లు నేటి నుండి అందుబాటులో ఉండనున్నాయి. ఉచిత దర్శనం టికెట్లు నేటి నుండి భక్తులకు అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. కరోనా మూలంగా దాదాపు 5నెలల పాటు సర్వ దర్శనం టికెట్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అది కూడా కేవలం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించారు.

తర్వాత మరికొన్ని రోజులకు అందరికీ సర్వదర్శనం టికెట్లు ఇవ్వబడతాయని టీటీడీ పేర్కొంది. టికెట్లు ఇవ్వడం మొదలు, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రాత్రి నుండే టికెట్ల కోసం వేచి ఉన్నారు. ప్రతీరోజూ 2వేల సర్వదర్శనం టికెట్లు కేటాయించాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news