మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు నటుడు బండ్ల గణేష్. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన బండ్ల గణేష్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహానుభావులు అందరూ కూర్చొని 28 సంవత్సరాలక్రితం మా అసోసియేషన్ పెట్టారని… ప్రతి అధ్యక్షుడు బాగానే చేసారన్నారు. గత ప్రెసిడెంట్ నీ నువ్వు దిగు దిగు అని అన్యాయంగా అయాన్ని దింపే ప్రయత్నం చేశారని… ఇప్పుడు కొందరు వచ్చి సభ్యుల ను ప్రలోభ పెడుతున్నారని ఫైర్ అయ్యారు.
మన హీరోలందరిని తీసుకొచ్చి ప్రోగ్రామ్ పెట్టి ఫండ్ కలెక్ట్ చేసి100 మంది అర్టిస్ట్లకు ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. తాను మా బిల్డింగ్ కట్టనబోనని… ఇప్పుడున్న ఆఫీస్ చాలన్నారు. మా బిల్డింగ్ కడతాను చార్మినార్ కడతాను, అది చేస్తా, ఇది చేస్తాను అంటున్నారు అవి ఏమి జరగవు అవన్నీ అబద్ధాలు అని కుండ బద్దలు కొట్టారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మా ఎలక్షన్ తరువాత మాట్లాడతానని… ప్రజల్ని ఎంటర్ టైన్ మెంట్ చేసే మన ఆర్టిస్టులు వుండగా ఎవరినో ఫండ్ అడగడం ఏమిటి ? అని ప్రశ్నించారు. నా విజయాన్ని ఎవరు ఆపలేరని…. ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఏమి చేసారు ఏమి చెయ్యలేదు అది మీకు తెలుసా ? అని పేర్కొన్నారు. సభ్యులందరూ మిగతా వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకోండి ఓటు మాత్రం తనకే వేయాలని కోరారు.