బెంగళూరులో భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నగరవాసులు ఏకధాటి వానలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఈ వర్షాలు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. వరదలతో రోడ్లన్ని చెరువులను తలపిస్తుండటంతో కార్యాలయాలకు ట్రాక్టర్లపై వెళ్తున్నారు.
హెచ్ఏఎల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న యెమలూరు వరద ధాటికి పూర్తిగా జలమయమైంది. ఈ ప్రాంతంలో అనేక మంది ఐటీ నిపుణులు నివసిస్తున్నారు. ద్విచక్రవాహనాల్లో బయటకు వెళ్లే పరిస్థితి లేని నేపథ్యంలో.. మంగళవారం వీరంతా ట్రాక్టర్లలో ఆఫీసులకు బయల్దేరారు. అయితే, ఈ ట్రాక్టర్ రైడ్ కొత్తగా ఉందని కొందరు ఐటీ నిపుణులు చెబుతున్నారు. ‘సాధారణంగా మేం ఆఫీసుకు సెలవు పెట్టం. లీవ్ తీసుకుంటే మా వర్క్ దెబ్బతింటుంది. అందువల్ల ట్రాక్టర్లలో వెళ్తున్నాం. రూ.50 ఇస్తే వారు మా ఆఫీసుల వద్ద దించేస్తున్నారు’ అని ఓ మహిళ ఐటీ ఉద్యోగి తెలిపారు.
మరోవైపు కొందరు సీఈఓలు జేసీబీలను ఆశ్రయించారు. ఇదివరకు అప్‌గ్రేడ్ సీఈఓ ట్రాక్టర్ ఎక్కి కార్యాలయానికి వెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. భారీగా కురిసిన వర్షాలతో తన ఇంటి ప్రాంతంలో పవర్ లేదని, దాంతో పనినిమిత్తం ట్రాక్టర్‌లో ఆఫీస్‌కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.
Family and my Pet Albus has been evacuated on a Tractor from our society that’s now submerged. Things are bad. Please take care. DM me if you need any help, I’ll try my best to help. pic.twitter.com/MYnGgyvfx0
— Gaurav Munjal (@gauravmunjal) September 6, 2022