ఖాతాదారులకు అలర్ట్ : ఈ నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు..

-

ప్రస్తుతం.. ప్రజల దినచర్య బ్యాంకులతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి బ్యాంకుల సెలవు దినాలపై ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు.. ఏవైనా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను సెలవులకు అనుగుణంగా మార్చుకుంటారు.. కాబట్టి మే నెలలో సాధారణ సెలవులు కలిపి మొత్తం 11 సెలవు దినాలను ఆర్‌బీఐ గుర్తించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది. వీటిని గమనించి వినియోగదారులు తమ బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది. ప్రాంతాల వారీగా బ్యాంకు​ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

మే 1: ఆదివారం
మే 2: రంజాన్​
మే 3: అక్షయ తృతీయ, భగవాన్​ శ్రీ పరశురామ జయంతి
మే 8: ఆదివారం
మే 9: రబీంద్రనాథ్​ ఠాగూర్​ జయంతి(కోల్​కతా)
మే 14: రెండో శనివారం
మే 15: ఆదివారం
మే 19: బుద్ధ పూర్ణిమ (కోల్​కతా, ముంబయి, లఖ్​నవూ, శ్రీనగర్​, భోపాల్​, అగర్తలా)
మే 22: ఆదివారం
మే 28: నాలుగో శనివారం
మే 29: ఆదివారం
మూడు కేటగిరీల కింద బ్యాంకులకు ఆర్​బీఐ సెలవులు ఇస్తుంది. హాలిడే అండర్​ నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్స్​ యాక్ట్​, రియల్​ టైమ్​ గ్రాస్​ సెటిల్​మెంట్​ హాలీడే, బ్యాంకుల అకౌంట్స్​ క్లోజింగ్​ కింద సెలవులు మంజూరు చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news