అమరావతి: సీతానగరంలో ఇటీవల కాలంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలుస్తూ చెక్కులు అందజేసింది. ఈ చెక్కకు చిక్కులు వచ్చాయి. బాధితురాలికి ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్కు అందించింది. దీంతో పాటు స్త్రీ.శిశు సంక్షేమశాఖ తరపున రూ .25 వేల చెక్కు అందచేశారు. అయితే రూ. 25 వేల చెక్కు విషయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో బ్యాంకు అధికారులు చెక్ పాస్ చేయకుండా నిలిపి వేశారు. త్వరలో మరో చెక్‌ను అందిస్తామని చెప్పారు.
సీతానగరం రేప్ బాధితులకు షాక్
-