ఎస్బీఐలో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ..ప్రతి నెల డబ్బులు..పూర్తి వివరాలు..

-

ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.అందులో కొన్ని పథకాలలో పెట్టుబడి పెడితేవిషయ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. అందుకే ఈ మధ్య పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.ఇప్పుడు కొత్తగా ఎన్నో మరి కొన్ని స్కీమ్ లు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చుద్దాము..మీ చేతిలో డబ్బులు ఉన్నాయా? వీటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? రిస్క్ లేకుండా రాబడి పొందాలని ప్లాన్ వేస్తున్నారా? అయితే మీకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి పనికి రావు. బ్యాంకులు అందించే స్కీమ్స్ లేదంటే పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు..

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న ఎస్‌బీఐ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అందిస్తోంది. దీని పేరు ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. అలాగే పోస్టాఫీస్‌లో కూడా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఉంది ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్

ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాన్యుటీ రూపంలో ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఇందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో కొంత భాగం, అలాగే వడ్డీ డబ్బులు కలిసి ఉంటాయి. మెచ్యూరిటీ కాలం 36, 60, 84, 120 నెలలుగా ఉంది. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐ ఈ స్కీమ్‌పై 5.45 శాతం నుంచి 5.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 5.95 శాతం నుంచి 6.3 శాతం వరకూ వడ్డీని పొందవచ్చు..

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..

అలాగే పోస్టాఫీస్ కూడా కస్టమర్ల కోసం మంత్లీ ఇన్‌కమ్ పథకాన్ని తీసుకువచ్చింది. సింగిల్‌గా లేదా ముగ్గురు కలిసి ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవొచ్చు. ఈ ఖాతా తెరవాలంటే కనీస డిపాజిట్ రూ. 1000 కావాలి. గరిష్టం రూ. 4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే జాయింట్ అకౌంట్ అయితే రూ. 9 లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ వస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే ఎస్‌బీఐ అందించే యాన్యుటీ స్కీమ్ కన్నా ఇందులో ఎక్కువ వడ్డీ వస్తోందని చెప్పుకోవచ్చు..ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కేంద్రం భరోసా కూడా ఉంటుంది..మంచి ఆదాయం తో పాటు సేఫ్ కూడా…ఈ రెండు బెస్ట్ అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news