బ్యాంకు ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్.. పండుగ గిఫ్ట్ అదిరిపోయిందిగా..!!

-

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఇండస్ఇండ్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీని పెంచుతున్నట్లు ప్రకటించారు.బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మొత్తం పొందుతారు..

 

2 కోట్ల డిపాజిట్లకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. ఇప్పుడు 7 రోజుల నుంచి 30 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే 31 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే 4 శాతం ఆఫర్ చేస్తోంది. ఇంకా 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. 61 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.6 శాతంగా కొనసాగుతోంది. 91 రోజుల నుంచి 120 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 4.75 శాతం వడ్డీ రేటు ఉంది..అదే విధంగా..121 రోజుల నుంచి 180 రోజులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 181 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. 211 రోజుల నుంచి 269 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.8 శాతంగా లభిస్తోంది. అలాగే 270 రోజుల నుంచి 354 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. 355 రోజుల నుంచి 364 రోజులకు గాను 6.25 శాతం వడ్డీని పొందవచ్చు..

ఇక ఏడాది లేదా ఏడాదిన్నరకు టెన్యూర్‌పై 7.5 శాతం వడ్డీ ఉంది. ఏడాది ఆరు నెలల నుంచి మూడేళ్ల మూడు నెలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.75 శాతంగా లభిస్తోంది. అలాగే మూడేళ్ల 3 నెలల నుంచి 61 నెలల ఎఫ్‌డీలపై 7.25 శాతం, 61 నెలల నుంచి ఆపైన టెన్యూర్‌పై 7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇండస్ ట్యాక్స్ సేవర్ స్కీమ్ పై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. కాగా సీనియర్ సిటిజన్స్‌కు 8.25 శాతం వడ్డీ ఉంది.బ్యాంకులో డబ్బులను దాచుకోవాలని అనుకొనేవారు వీటిని ఒకసారి పరిశీలించవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news